వేగం పెంచిన బన్నీ.. అందుకోసమే..?

వేగం పెంచిన బన్నీ.. అందుకోసమే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తన తాజా సినిమా పుష్పతో పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ పెంచుకునేందుకు అర్జున్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను ఫైనల్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరొకటి. వీటిలో ముందుగా కొరటాల శివ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు కావాలసిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో అంటే దాదాపు మార్చి31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అందుకోసం అల్లు అర్జున్ పుష్ప సినిమాను శరవేగంతో పూర్తి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే కొరటాల శివతో చేయనున్న సినిమాలో అర్జున్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచూ చూడాల్సిందే.