600 మిలియన్ క్లబ్ లో 'బుట్టబొమ్మ'

600 మిలియన్ క్లబ్ లో 'బుట్టబొమ్మ'

బన్నీ, త్రివిక్రమ్ కలయిలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఘన విజయం సాధించటంలో పాటల పాత్ర మరువలేనిదనే చెప్పవచ్చు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో సింహ భాగంలో నిలిచింది. హారిక అండ్ హాసిన క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ఈ సినిమా పాటలు అద్భుతాన్నేసృష్టించాయి. గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. సినిమాలోని 'సామజవరగమనా', 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన 'బుట్టబొమ్మ' పాట తాజాగా మరో లాండ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ పాట యూట్యూబ్ లో 600 మిలియన్ల వ్యూస్ తో పాటు దాదాపు 40 మిలియన్ లైక్స్ తో సంచలనం సృష్టించింది. ఇటువంటి రేర్ ఫీట్ సాధించిన తొలి తెలుగు పాట 'బుట్టబొమ్మ' కావటం విశేషం. త‌మ‌న్ ట్యూన్ కి తగ్గట్టుగా బ‌న్నీ, పూజ డ్యాన్స్మూ మెంట్స్ పలువురు సెలబ్రటీలతో కూడా స్టెప్స్ వేయించాయి. అంతలా అందరినీ ఆకట్టుకున్న 'బుట్టబొమ్మ' పాట మునుముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం.