బ్రేకింగ్ : తెలంగాణలో తొలి వ్యాక్సిన్ ఎవరికంటే ?

బ్రేకింగ్ : తెలంగాణలో తొలి వ్యాక్సిన్ ఎవరికంటే ?

తెలంగాణలో  మొదటి టీకా సఫాయి కర్మ చారి అంటే పారిశుధ్య కార్మికునికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ఇవాళ తెలంగాణకు 20 వేల కోవాగ్జిన్ డోసులు కూడా వచ్చి చేరాయి. 139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్ లో 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నారు. మొదట్లో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు..తర్వాత ప్రయివేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వేయనున్నారు. తర్వాత రోజు అంటే రెండవ రోజు 50.. ఆ తర్వాత రోజు 100 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. అలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నారు. ఇక ఈ వ్యాక్సిన్ కోసం తెలంగాణలో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఏమయినా రియాక్షన్ వస్తే చికిత్స అందించడానికి 57 ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల ఏర్పాటు చేసారు. టీకా ఇచ్చిన తర్వాత, ఖాళీ వాక్సిన్ వాయిల్ ను రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక కాసేపట్లో కోఠి నుంచి జిల్లాలకు వాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎస్కార్ట్ వాహనాలతో ఇన్సులేటర్ వాహనాలు వెళ్లనున్నాయి. అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే  కోవాగ్జిన్ డోసులను క్లినికల్ ట్రాయల్స్ లో భాగంగానే ఇవ్వనున్నారు. అంటే టీకా తీసుకునే వాళ్ళ అనుమతి, సంతకం తీసుకున్నాకే వారికి ఈ డోసులు ఇవ్వనున్నారు.