అందరికంటే అక్కినేని హీరోలే ముందున్నారు

అందరికంటే అక్కినేని హీరోలే ముందున్నారు

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇప్పటికే లక్షల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు సెలబ్రిటీలు బయట అడుగు పెట్టడానికి భయపడుతున్నారు . ఇక సినిమా తారలు అందరు ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్ లకు అనుమతులుఇచ్చినా ఎవ్వరూ సాహసం చేయడం లేదు.  చాలా సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. కొన్ని రిలీజ్ కు సిద్దమై ఆగిపోయాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు కనపడక కొంతమంది నిర్మాతలు తమ సినిమాలనువచ్చిన ధరకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్  లో రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే షూటింగ్ మెల్లగా మొదలుపెట్టాలని హీరోలు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో నిర్మాతలు నష్టం వాటిల్లే అవకాశం ఉండటం తో షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. అయితే వీరిలో అక్కినేని హీరోలు దైర్యంగా ముందడుగు వేశారు. కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటూనే ఆయన నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. మరో వైపు నాగచైతన్య కూడా కరోనాకు భయపడకుండా  షూటింగ్ కు హాజరవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేస్తున్నాడు చైతూ .. ఇక యంగ్ హీరో అఖిల్ కూడా తన సినిమాను మొదలు పెట్టేసాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్ . ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే తన కార్వాన్లో నిల్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షూటింగ్ మొదలైనట్టు కన్ఫర్మ్ అయింది. ఇలా అందరికంటే ముందు అక్కినేని హీరోలు తమ సినిమాలను మొదలు పెట్టారు . అక్కినేని హీరోలను చూసైనా మిగిలినవారు దైర్యం చేస్తారేమో చూడాలి.