మరో మైల్ స్టోన్ చేరిన బుట్ట బొమ్మ...

మరో మైల్ స్టోన్ చేరిన బుట్ట బొమ్మ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దానికి ముఖ్య కారణం తమన్ మ్యూజిక్ అని చెప్పాలి. ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. సినిమా  విడుదల కు ముందు లిరికల్ సాంగ్స్ దులిపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి ఒక్కొక్క వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ విడుదలైన క్షణం నుండే దూసుకపోతున్నాయి. కానీ బుట్ట బొమ్మ వీడియో సాంగ్ మాత్రం వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా ఉన్న ఇప్పుడు మాత్రం ఆ రెండు పాటలను దాటేసి ఏకంగా 300 మిలియన్ క్లబ్బులో చేరిపోయింది. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్ వేదిక తెలిపారు. ఈ పాట తర్వాత రాములో రాములా' సాంగ్ 172 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానం లో ఉంది.