500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

యూట్యూబర్‌పై యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తనపై తప్పుడు ప్రచారాలు సృష్టించిన బీహార్‌కు చెందిన రషీద్ సిద్దిఖీ అనే యూట్యూబర్‌పై అక్షయ్ పరువు నష్టం దావా వేశారు. ఇదే కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే పేర్లను కూడా లాగినందుకు గానూ సదరు యూట్యూబర్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యూట్యూబర్‌పై శివసేన లీగ్ సెల్‌లోని ధర్మేంద్ర మిశ్రా అనే లాయర్ కేసు నమోదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనితో అసలు గుట్టంతా బయటికొచ్చింది. తన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు రషీద్ సిద్దిఖీ సుశాంత్ ఆత్మహత్య కేసును ఉపయోగించుకున్నాడు. తప్పుడు వార్తలు సృష్టిస్తూ గత కొన్ని నెలల్లో లక్ష నుంచి 3.70 లక్షలపైగా సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తన వీడియోల ద్వారా మే నెలలో సిద్దిఖీ రూ. 296 సంపాదిస్తే.. సెప్టెంబర్ ఆ సంపాదన కాస్తా రూ. 6 .50 లక్షలకు చేరింది.