దక్షిణాది దెయ్యం కథలపై అక్షయ్‌ కుమార్ ఆసక్తి...

దక్షిణాది దెయ్యం కథలపై అక్షయ్‌ కుమార్ ఆసక్తి...

సోషల్ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో మెసేజులు ఇస్తోన్న అక్షయ్‌ కుమార్ సడన్‌గా దెయ్యాల ప్రేమలో పడ్డాడు. సౌత్‌ సూపర్‌ హిట్ హారర్‌ స్టోరీస్‌ని హిందీలో తీస్తున్నాడు. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఇక్కడ హిట్‌ అయిన దెయ్యాల కథలని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. అయితే రీసెంట్‌గానే దెయ్యం కథ 'లక్ష్మీ'తో ఓటీటీలోకి వచ్చాడు. లారెన్స్‌ భూతాల సీరీస్‌ 'కాంచన' రీమేక్‌గా వచ్చిందీ సినిమా. హిందీలో కూడా ఈ మూవీని లారెన్సే డైరెక్ట్‌ చేశాడు. అయితే అక్షయ్‌ కుమార్‌ సొంత బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి ఫ్లాప్‌ టాక్ వచ్చింది. అక్షయ్‌ కుమార్‌ నిర్మాణంలో మరో దెయ్యాల కథ వస్తోంది. తెలుగులో అనుష్క చేసిన హారర్‌ మూవీ 'భాగమతి'ని హిందీలో 'దుర్గామతి'గా రీమేక్‌ చేశాడు అక్షయ్. టీసీరీస్‌తో కలిసి అక్షయ్‌ నిర్మించిన ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. భూమి ఫడ్నేకర్ లీడ్‌ రోల్‌ ప్లే చేసింది. మరి ఈ దెయ్యం అయినా అక్షయ్‌ కుమార్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ తీసుకొస్తుందా అన్నది చూడాలి.