ట్రెండింగ్ లో అఖిల్ "ఏజెంట్" లుక్

ట్రెండింగ్ లో అఖిల్ "ఏజెంట్" లుక్

అఖిల్ అక్కినేని 5వ చిత్రం "ఏజెంట్" ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'ఏజెంట్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అక్కినేని అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. 'ఏజెంట్' ఫస్ట్ లుక్ లో మునుపెన్నడూ కన్పించని విధంగా సరికొత్త మేకోవర్ తో తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. రఫ్ లుక్ లో సిగరెట్ తాగుతూ ఉన్న అఖిల్ లుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లో రెండవ స్థానంలో ఉండడం విశేషం. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి 'ఏజెంట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సురేందర్ 2 సినిమా' బ్యానర్ పై సుంకర రామబ్రహ్మంతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా... థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న 'ఏజెంట్'... ఇదే ఏడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ 'ఏజెంట్'పై ఫస్ట్ లుక్ తోనే భారీగా హైప్ క్రియేట్ చేశారు. దీంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.