అజయ్ భూపతితో అఖిల్ సినిమా!?

అజయ్ భూపతితో అఖిల్ సినిమా!?

అక్కినేని బుల్లోడు అఖిల్ త్వరలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను ఉగాది పర్వదినాన ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ పెట్టారు. 'ఏజెంట్' గా అఖిల్ మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దానిపై కూడా క్లారిటీ వచ్చిందంటున్నారు. వరుస హిట్స్ కొడుతున్న మైత్రి మూవీస్ సంస్థలో సినిమా చేయటానికి అఖిల్ కమిట్ అయ్యాడట. 'ఆర్.ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథ అటు నిర్మాతలకు, ఇటు అఖిల్ కి కూడా నచ్చిందట. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' పూర్తి చేసి సురేందర్ రెడ్డి 'ఏజెంట్' తో బిజీగా ఉన్నాడు. అటు అజయ్ భూపతి కూడా 'మహాసముద్రం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. మైత్రి సంస్థ కూడా బన్నితో `పుష్ప`, మహేష్ తో `సర్కార్ వారి పాట`, ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాలను లైన్లో పెట్టింది. వారి వారి కమిట్ మెంట్స్ కి అనుగుణంగా అఖిల్, అజయ్ భూపతి సినిమా పట్టాలెక్కుతుందట. లెట్స్ వెయిట్ అండ్ సీ.