కోహ్లీ తో కెప్టెన్సీ వార్ పై స్పందించిన రహానే...

కోహ్లీ తో కెప్టెన్సీ వార్ పై స్పందించిన రహానే...

భారత జట్టులో చాలా రోజుల నుండి కెప్టెన్సీ పై చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా జట్టును నడిపించి సారథిగా రహానే మంచి పేరు తెచ్చుకున్నాడు.దాంతో టెస్టు ఫార్మాట్‌లో అతడిని కెప్టెన్‌ చేయాలనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా తమ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమేనని రహానే స్పష్టం చేశాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కోహ్లీ కెప్టెన్‌గా, నేను వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాం. ఈ హోదాలు మారడం వల్ల జట్టులో ఎలాంటి మార్పు రాదు. ఎప్పటికీ విరాటే మా కెప్టెన్‌. నేను అతడికి డిప్యూటీని మాత్రమే. అతను లేనప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం, నా అత్యుత్తమ ప్రదర్శనతో టీమ్‌ గెలిచేలా చేయడమే నా బాధ్యత.' అని రహానే తెలిపాడు. కోహ్లీతో తన సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి సమస్య లేదని రహానే స్పష్టం చేశాడు. ఎన్నోసార్లు అతను నా బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాం. అతను నాలుగో స్థానంలో, నేను ఐదో స్థానంలో ఆడటం వల్ల పలు మంచి భాగస్వామ్యాలు నమోదదు చేశాం అని రహానే చెప్పుకొచ్చాడు.