ఐపీఎల్ కంటే ఆరోగ్యం ముఖ్యం : రహానే

ఐపీఎల్ కంటే ఆరోగ్యం ముఖ్యం : రహానే

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. ఇందుకోసం ఆటగాళ్లు ఒక నెల ముందే అక్కడికి చేరుకోనున్నారు. అయితే ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు కరోనా నియమాలు తప్పకుండ పాటించాలి. అందుకోసం టోర్నీ మొత్తం వారు బయో- సెక్యూర్ బబుల్‌ లో ఉండాల్సి ఉంటుంది. మరి ఇందులోకి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతిస్తారా.. లేదా అనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. 

అయితే ఈ విషయం పై 2020 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్న క్రికెటర్ అజింక్యా రహానె స్పందించాడు. ఐపీఎల్ బయో- సెక్యూర్ బబుల్‌ లోకి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు తుది నిర్ణయం తీసుకోవాలని. సాధారణ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు తాను ఇష్టపడేవాడినని, కానీ ఇప్పుడు ఐపీఎల్ కు తీసుకెళ్లడం కంటే వారి ఆరోగ్యం చాల ముఖ్యం అని చెప్పాడు.