ఆ కేక్ ను కట్ చేయడానికి 'నో' చెప్పిన రహానే...

ఆ కేక్ ను కట్ చేయడానికి 'నో' చెప్పిన రహానే...

ఆసీస్ పై విజయం తర్వాత తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లకు అదిరిపోయే స్వాగతం లభించింది. తన కూల్ కెప్టెన్సీతో దేశం గర్వపడేలా చేసిన అజింక్యా రహానేకు కూడా అభిమానులు రెడ్ కార్పెట్‌తో ఘనస్వాగతం పలికారు. బ్యాండ్, బాజాతో అతని నివాసం వద్ద స్థానికులు సంబరాలు చేసుకున్నారు. అయితే కుమార్తె ఆర్యను ఎత్తుకుని ఇంట్లోకి వెళ్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే మైదానంలోనే కాకుండా బయట కూడా రహానే చాలా ఒరశాంతంగా ఉంటాడు. ఇక రహానే రాక సందర్భంగా స్థానికులు తెచ్చిన కేక్‌ను కట్ చేయడానికి ఈ భారత తాత్కలిక కెప్టెన్ నిరాకరించాడు. ఎందుకంటే... అభిమానులు ఆ కేకుపై కంగారును ఉంచగా.. దాన్ని కట్ చేసి ప్రత్యర్థి జట్టును అవమానించలేనని రహానే చెప్పకనే చెప్పాడు. తొలి మ్యాచ్​ అనంతరం పెటర్నీలీవ్‌పై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా.. సారథ్య బాధ్యతలు అందుకున్న రహానే​ జట్టును అద్భుతంగా నడిపాడు.