బంపరాఫర్.. 11 జీబీ డేటా ఫ్రీ..!

బంపరాఫర్.. 11 జీబీ డేటా ఫ్రీ..!

టెలికం రంగంలో అన్నీ ఉచితమంటూ ఎంట్రీ ఇచ్చిన జియో.. అన్ని టెలికం కంపెనీలు కూడా ఆఫర్లు ఇచ్చేలా చేసింది.. ఆ తర్వాత క్రమంగా ఉచితం మాట మాయమైంది.. కానీ, ఇప్పుడు భారత టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ బంపరాఫర్ తీసుకొచ్చింది.. 11 జీబీ డేటాను ఫ్రీగా అందుకునే అవకాన్ని కల్పిస్తోంది.. ఈ ఆఫర్‌ ఎయిర్‌టెల్ కొత్త 4జీ కస్టమర్లకు లేదా 4జీకి అప్ గ్రేడ్ అయ్యేవారికి లభిస్తుంది.. అయితే, మొత్తం 11 జీబీ డేటా ఒకేసారి పొందే వీలులేదు.. మరో విషయం ఏంటంటే.. ఇది కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. ఈ ఫ్రీ డేటాను పొందాలంటే.. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 11 జీడీ ఫ్రీ డేటా రెండు విడతల్లో పొందవచ్చు. 

మొదట.. కొత్త ఎయిర్‌టెల్ 4జీ కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోగానే 5 జీబీ డేటా లభించనుండగా.. ఈ డేటా మొత్తం ఐదు 1 జీబీ కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నెంబర్ యాక్టివెట్ అయిన నెల రోజుల్లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకునే విధంగా అవకాశం ఇచ్చింది ఎయిర్‌టెల్.. ఇక, 1జీడీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే 5 జీడీ డేటాకు బదులు 2 జీబీ డేటా వస్తుంది. ఇక, అన్‌లిమిటెడ్ ప్యాకేజీ తీసుకునే కస్టమర్లకు దాదాపు 6 జీబీ డేటా వరకు ఉచితంగా అందిస్తుంది.. మరోవైపు 84 వ్యాలిడిటీతో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీని ఎంచుకుంటే కస్టమర్లకు 6 జీబీ డేటా ఫ్రీ..  రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకుంటే 4 కూపన్లు, రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 2 కూపన్లు వస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయాలి. కొత్త 4 జీ ఎయిర్‌టెల్ కస్టమర్ రూ.598 ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకుంటే 11 జీడీ డేటా ఫ్రీగా పొందే అవకాశం కల్పించింది ఎయిర్‌టెల్.