బ్రేకింగ్‌: రెండు ముక్క‌లైన ఎయిరిండియా విమానం..

బ్రేకింగ్‌: రెండు ముక్క‌లైన ఎయిరిండియా విమానం..

క‌రోనా స‌మ‌యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ ద్వారా ప్ర‌త్యేక విమానాల్లో స్వ‌దేశానికి త‌ర‌లిస్తోంది భార‌త ప్ర‌భుత్వం.. వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా.. దుబాయ్ నుంచి కోజికోడ్ వ‌చ్చిన ఎయిరిండియా విమానం ప్ర‌మాదానికి గురైంది.. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియాకు చెందిన IX-1344 విమానం.. కోజికోడ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 గంట‌ల స‌మ‌యంలో ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతోన్న స‌మ‌యంలో.. రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది.. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది.. విమానం రెండు ముక్క‌లైపోయింది.. ఈ విమానంలో.. ఆరుగురు సిబ్బందితో పాటు 191 మంది ఉన్న‌ట్టుగా చెబుతున్నారు.. భారీ వర్షం కురుస్తున్న స‌మ‌యంలో.. విజిబులిటీ త‌క్కువ‌గా ఉండ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నారు.. అస‌లు ఇలాంటి ప‌రిస్థితుల్లో విమానం ల్యాండింగ్‌కు ఎందుకు అనుమ‌తి ఇచ్చారు అనేదానిపై విచార‌ణ‌కు ఆదేశించింది డీజీసిఏ. మ‌రోవైపు.. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.. ప‌లువురు ప్ర‌యాణికులు గాయాల‌పాలు కాగా.. పైల‌ట్ మృతిచెందిన‌ట్టుగా చెబుతున్నారు.