జార్జియా విమానాన్ని బలవంతంగా దించేసిన ఐఏఎఫ్

జార్జియా విమానాన్ని బలవంతంగా దించేసిన ఐఏఎఫ్

గగనతల మార్గాన్ని ఉల్లంఘించినందుకు కరాచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న జార్జియాకి చెందిన ఒక ఆంటనోవ్ ఏఎన్-12 విమానాన్ని భారత వాయు సేన బలవంతంగా జైపూర్ విమానాశ్రయంలో దించేసింది. ఈ విమానం నిర్ధారిత విమాన మార్గం నుంచి పక్కకు తొలగి ఉత్తర గుజరాత్ లోని నిర్ధారించని ప్రాంతం నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ తన ఎయిర్ డిఫెన్స్ విమానంతో దీనిని విజయవంతంగా అడ్డుకొని జైపూర్ ఎయిర్ ఫీల్డ్ లో దించేసేలా చేసింది. జార్జియా విమానం పైలెట్లను అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.