బెజవాడలో రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ..

బెజవాడలో రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ..

ఎంఐఎం.. ఇది పూర్తిగా తెలంగాణకు పరిమితమైన పార్టీ..! మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన పార్టీ అనే పేరుంది.. కానీ, క్రమంగా ఆ పార్టీ విస్తరిస్తోంది.. హైదరాబాద్‌ నుంచి ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేసిన సందర్భాలు లేకపోలేదు.. ఆ తర్వాత ఈ మధ్య దేశవ్యాప్తంగా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలకు జరిగినా.. అక్కడ పోటీ చేస్తూ వస్తోంది ఎంఐఎం.. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, వారు గెలవకపోయినా.. కొన్ని చోట్ల ప్రధాన పార్టీలను ఘోరంగా దెబ్బకొట్టారు. ఇక, బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుసేన్‌ ప్రచారం చేశారు. 64 స్థానాల్లోని 2 స్థానాల్లో.. ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.