పరస్త్రీతో సంబంధం పెట్టుకోనని భర్త బాండ్ పేపర్ రాసిచ్చాడు... ఆరు నెలలు తిరక్కముందే...!!

పరస్త్రీతో సంబంధం పెట్టుకోనని భర్త బాండ్ పేపర్ రాసిచ్చాడు... ఆరు నెలలు తిరక్కముందే...!!

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా చాలా డేంజర్ అని చెప్పాలి.  అక్రమ సంబంధాల వలన కాపురాలు కూలిపోతుంటాయి.  అయినా సరే ఈ అక్రమ సంబంధాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. అక్రమ సంబంధాల వలనే దేశంలో కేసులు అధికంగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి.  గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది.  

వీరికి ఓ పాప. అయితే, ఈ యువకుడు పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు.  ఈ విషయం ఎలాగోలా భార్యకు తెలిసింది. దీంతో కాపురం చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అయ్యింది.  బయట అందరికి తెలిస్తే పరువుపోతుందని చెప్పి బతిమిలాడాడు.  ఎలాగోలా సర్దిచెప్పడంతో ఒప్పుకొని ఉండటానికి అంగీకరించింది. అయితే, పరాయి స్త్రీతో సంబంధాలు పెట్టుకొనని, తనను బాగా చూసుకుంటానని రూ. 100 బాండ్ పేపర్ పై రాసివ్వాలని కోరింది.  అలానే రాసిచ్చాడు భర్త.   2019 ఆగస్టు లో ఈ సంఘటన జరిగింది.  సరిగ్గా ఆరు నెలల తరువాత ఆమెకు మామ నుంచి వేధింపులు మొదలయ్యాయి.  ఇంట్లో ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా ఉద్యోగం చెయ్యొచ్చుకదా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.  మామ నుంచి వేధింపులు వస్తున్నాయని కేసు పెట్టింది.  ఈ క్రమంలోనే భర్త భార్యకు రాసిచ్చిన బాండ్  పేపర్ విషయం బయటకు వచ్చింది.  ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.