షూటింగ్ కు సిద్దమవుతున్న మంచువారబ్బాయి

షూటింగ్ కు సిద్దమవుతున్న మంచువారబ్బాయి

మంచు మనోజ్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత  మనోజ్ కెమెరా ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అహం బ్రహ్మాస్మి సినిమాను ప్రకటించిన మంచు మనోజ్ ఆ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.. తన కెరియర్ లో ఎప్పుడు చేయనటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడు ఈ మంచువారబ్బాయి . అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది . నెలలు గడుస్తున్నా సినిమా ఎప్పుడు మొదలు పెట్టనున్నాడో క్లారిటీ రాలేదు . మధ్యలో కరోనా మహమ్మారి ఎంటర్ అవ్వడంతో ఇది కాస్తా ఇంకా ఆలస్యం అయ్యింది.  ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.  హైదరాబాద్ శివారుల్లో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను ముందుగా చిత్రీకరించనున్నారట. నవంబర్ 2 నుంచి పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ మొదలు కాబోతుంది . బ్రేక్ లేకుండా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో తనకు సాలిడ్ హిట్ దక్కడం ఖాయం అనే ధీమాతో ఉన్నాడు మనోజ్ .