చిన్న డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలి...

చిన్న డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలి...

కాసేపట్లో అగ్రిగోల్డ్ కేసు విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ రాంచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ముందు విచారణ జరగనుంది. ఇరవై వేల లోపు డిపాజిట్ చేసిన చిన్న డిపాజిటర్లకు తాము చెల్లింపులు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణపై విచారణ జరపాలని, హైకోర్టు ఆధీనంలో ఉన్న నిధులు బాధితులకు చెల్లించాలని దరఖాస్తు వేశారు  తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు. మరి ఈ రోజు విచారణలో తుది తీర్పు వస్తుందా... లేదా మళ్ళీ విచారణ వాయిదా పడుతుందా అనేది చూడాలి.