వారికి డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి...

వారికి డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి...

తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ ఈరోజు జరిపింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వార్డు సచివాలయం ద్వారా సీఐడీ, సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారు అని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ దరఖాస్తులను ధ్రువీకరిస్తారు. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం అని ఏపీ ప్రభుత్వం వివరించింది.

మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపింది. బదిలీ చేసే పరిపాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటదని స్పష్టం చేసింది ధర్మాసనం. ఈ విషయం పై ఏపీ ప్రభుత్వం 2 వారాలు గడువు కోరగా.. దానిని తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చాయి ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ. బ్యాంకుల పిటిషన్లపై గురువారం విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.