మళ్ళీ లాక్ డౌన్ తప్పదా? 

మళ్ళీ లాక్ డౌన్ తప్పదా? 

ప్రపంచంలో కరోనా కేసులు తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ  దేశాల్లో ఇప్పటికే నాలుగు వారాలపాటు లాక్ డౌన్ విధించారు.  ఫ్రాన్స్ లో వ్యాపారరంగం నాలుగు వారల పాటు స్తంభించింది.  అటు బ్రిటన్ లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  స్పెయిన్ దేశంలో కూడా కేసుల సంఖ్య తిరిగి పెరుగుతున్నది.  స్పెయిన్ లోని పలు స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికే రాకపోకలను నిషేధం విధించాయి.  రాబోయేర్ రోజుల్లో స్పెయిన్ లో కూడా లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి.  యూరప్ మొత్తం ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహమ్మారి నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకుంటుందా అంటే చెప్పలేమని చెప్పాలి.