శ్రీకాకుళంలో మరో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు,రాళ్ళతో పరస్పర దాడులు !

శ్రీకాకుళంలో మరో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు,రాళ్ళతో పరస్పర దాడులు !

శ్రీకాకుళంలో మరో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకుండు. కర్రలు,రాళ్ళతో పరస్పర దాడులు చేసుకోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల దాడుల్లో ఇళ్లు, వాహనాలు, షాపులు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చొరబడి టీవీలు , ఇతర సామాన్లు ధ్వంసం కూడా ఇరువర్గాలు చేసుకున్నట్టు చెబుతున్నారు.  ఇక మరో పక్క శ్రీకాకుళం జిల్లాలో ఓ సర్పంచ్ విజయం పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీశాయి. నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల్లో జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా 40 ఓట్లతో టీడీపీ మద్దతుదారుడు ఆమోజుల ఆరుద్ర అనే వ్యక్తి గెలు పొందాడు.

ఈ క్రమంలో తమ గెలుపును సంబరం చేసుకోవడం కోసం గ్రామదేవతకు మొక్కు చెల్లించుకునేందుకు టీడీపీ మద్దతుదారుడు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఐతే  ఓటమిని తట్టుకోలేని వైసీపీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతో వైసీపీ వర్గీయులను టీడీపీ వర్గీయులు నిలదీశారు . దీంతో వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల పై మూకుమ్మడిగా దాడులకు దిగారు. కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో మెట్టవలసలో ఉధ్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు . పోలీసులు మోహరించినప్పటికీ ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో....పోలీసులు వీధి వీధి తిరుగుతూ ఆందోళనకారులను ఇళ్లల్లోకి తరిమికొట్టారు . గ్రామంలో పరిస్థితులు చక్కబడేందుకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.