మన్‌దీప్‌ దారిలోనే మరో 5 ఆటగాళ్లు ఆసుపత్రికి...

మన్‌దీప్‌ దారిలోనే మరో 5 ఆటగాళ్లు ఆసుపత్రికి...

కరోనా కారణంగా వాయిదా పడిన ఒలంపిక్స్ కోసం బెంగళూరులో జాతీయ జట్టుకు శిక్షణ శిబిరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మొదట అందులో శిక్షణ తీసుకుంటున్న భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తో పాటు ముగ్గురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రాగ ఆ తర్వాత మరో ఇద్దరికి  కూడా కరోనా సోకినట్లు ఎస్‌ఐఐ తెలిపింది. అయితే వారందరిని శిక్షణ శిబిరంలోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ నిన్న మన్‌దీప్‌ అనే ఆటగాడికి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపధ్యం లో ముందు జాగ్రత్తగా మిగిలిన ఐదుగురు ఆటగాళ్లను కూడా అదే ఆసుపత్రికి తరలించారు. అందులో... కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్, సురేందర్‌ కుమార్, జస్‌కరణ్‌ సింగ్, డ్రాగ్‌ ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్, గోల్‌కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ ఉన్నారు. ఇక పురుషుల జట్టులో కరోనా కలకలం రేపడంతో మహిళ జట్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా అక్కడ అందరికి నెగెటివ్ వచ్చినట్లు ఎస్‌ఐఐ తెలిపింది.