ధోనీ భార్య భావోద్వేగం

ధోనీ భార్య భావోద్వేగం

ఐపీఎల్ టీ20 లీగ్‌ చరిత్రలో చెన్నై తొలిసారి ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశం కోల్పోయింది. గత ఏ సీజన్లో కూడా CSK ఇంత దారుణమైన ప్రదర్శన చేయలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని చెన్నై ఓడించినప్పటికీ.. ఆ గెలుపుని అభిమానులు ఆస్వాదించలేకపోతున్నారు. ఆదివారం రాజస్థాన్‌.. ముంబయిని ఓడించడంతో చెన్నై కథ ముగిసింది. ఈ క్రమంలోనే మిగతా రెండు మ్యాచ్‌లు గెలిచినా చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. ధోనీ పని అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును షేర్ చేశారు. ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమేనని... కొన్ని మ్యాచ్ లలో గెలుస్తారని, కొన్నింటిలో ఓడిపోతారని సాక్షి తెలిపారు. గెలిచినప్పుడు సంతోషించడం, ఓడినప్పుడు వేదనకు గురవడం జరుగుతుంటుందని అన్నారు. అయితే క్రికెట్ ను కేవలం ఆట మాదిరిగానే చూడాలని... మన భావోద్వేగాలను క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు వాడకూడదని చెప్పారు. ఓడిపోవాలని ఎవరూ కోరుకోరని... ఇదే సమయంలో అందరూ విజేతలు కాలేరని అన్నారు. నిజమైన యోధులు యుద్ధం చేయడానికే పుడతారని ధోని భార్య సాక్షి చేసిన భావోద్వేగపూరిత పోస్టు అందరిని ఆకట్టుకుంటోంది.