ఆఫ్రికా మిడతల దాడి... 64 దేశాలపై ప్రభావం... ఈసారి ముందుగానే... 

ఆఫ్రికా మిడతల దాడి... 64 దేశాలపై ప్రభావం... ఈసారి ముందుగానే... 

ఇండియాను ఇప్పుడు రెండు రకాల సమస్యలు వేధిస్తున్నాయి.  అందులో ఒకటి కరోనా వైరస్.  ఈ వైరస్ కారణంగా దేశంలో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు.  1.60 లక్షల మందికి పైగా కరోనా సోకింది.  ఇకపోతే కరోనా నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.  అయితే, ఇప్పుడు మరో భయం కూడా ఇండియాను వెంటాడుతున్నది.  అదే మిడతల భయం.  

ఆఫ్రికా ఖండం నుంచి ఎడారులు, సముద్రాలు దాటి ఆసియా దేశాల మీదుగా పాకిస్థాన్ కు అక్కడి నుంచి ఇండియాలోకి మిడతలు ప్రవేశించాయి.  కోట్లాది మిడతలు ఇండియాలోకి ప్రవేశించి పంటపొలాలను నాశనం చేస్తున్నాయి.  గుంపులు గుంపులుగా వచ్చే ఈ వలస మిడతలు ఒక్కసారి పొలంపై దాడిచేస్తే ఆ పంట మొత్తం స్వాహా చేసేస్తాయి.  ఆఫ్రికా నుంచి మొదలైన ఈ మిడతల గుంపులు సాధారణంగా జూన్ లేదా జులై నెలల్లో పాక్ లోకి ప్రవేశిస్తాయి.  కానీ, మార్చి నెలలో సిరియా, ఇరాన్, వంటి గల్ఫ్ దేశాల్లో వర్షాలు కురవడంతో ఆ మిడతలు ముందుగాని పాక్ కు చేరుకున్నాయి.  ఈ మిడతల వలన భౌతికంగా మనుషులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, రైతుల పంటలకు మాత్రం చేటు చేస్తాయి.  గాలివాటం దిశగా ప్రయాణం చేసే ఈ మిడతలు రోజుకు 5 నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాయి.  ఎడారి ప్రాంతంలో మాత్రమే ఇవి గుడ్లను పెడతాయి.  అంతేకాదు, ఇవి పగలు మాత్రమే యాక్టివ్ గా ఉండి పొలాలపై దాడి చేస్తాయి.  రాత్రి సమయాల్లో స్తబ్దతగా ఉంటాయి.  వీటిని గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లో ఆహారంగా తీసుకుంటారు.  వీటిలో ప్రోటీన్ పదార్ధం అధికంగా ఉంటుంది.