గ్రేటర్ ఎన్నికలపై అడవి శేష్ ఏమన్నాడంటే..?

గ్రేటర్ ఎన్నికలపై అడవి శేష్ ఏమన్నాడంటే..?

'గూఢచారి', 'ఎవరు', వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ ప్రస్తుతం 'మేజర్', 'గూఢచారి 2' మూవీస్ లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ , ఎ +ఎస్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా “మేజర్ ” మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శేష్ తాజాగా గ్రేటర్ ఎన్నికల గూర్చి ఏమన్నాడంటే.. 'ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నాం.. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమని' అడవి శేష్ అన్నారు.