అందరినీ షాక్ కు గురిచేసిన అదితీ రావ్!

అందరినీ షాక్ కు గురిచేసిన అదితీ రావ్!

కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడటం కాదు గానీ అదితిరావ్ ను ఇది ఓటీటీ స్టార్ ను చేసేసింది. గత యేడాది థియేటర్లు మూత పడిన సందర్భంగా అదితి రావ్ హైదరీ నటించిన మూడు భిన్న భాషా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. మలయాళ చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్', తెలుగు సినిమా 'వి' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాగా, హిందీ చిత్రం 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలన్నీ అదితీరావ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినవే. తాజాగా ఆమె నటించిన 'అజీబ్ దస్తాన్స్' అంథాలజీ కూడా నటిగా అదితిరావ్ ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీలోని 'గీలి పుచ్చి' అనే షార్ట్ ఫిల్మ్ లో అదితిరావ్ నటించింది. 'మసాన్' ఫేమ్ నీరజ్ గైవాన్ దీనిని తెరకెక్కించారు. స్వలింగ సంపర్కం, కుల విక్షణను హైలైట్ చేస్తూ తీసిన ఈ ఎపిసోడ్ లో అదితీరావ్, కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ ఆంథాలజీతో అదితీరావ్ కు మరిన్ని అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ 'మహా సముద్రం'లో అదితీరావ్ హైదరీ నటిస్తోంది.