ప్రభాస్ లేకుండా మొదలు కానున్న ఆదిపురుష్

ప్రభాస్ లేకుండా మొదలు కానున్న ఆదిపురుష్

రెబల్ స్టార్ ప్రభాస్ లేకుండానే ఆదిపురుష్ సినిమా ప్రారంభం కానుందట. ప్రభాస్ తన సినిమా రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఆదిపురుష్ దర్శకుడు ఓం రవుత్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పేరుతెచ్చుకున్నాడు. దాంతో ప్రభాస్ వెంటనే భారీ బడ్జెట్ సినిమా సాహోను తెరకెక్కించి మరో సారి తన స్టార్ డమ్ చూపించుకున్నాడు. వెంటనే వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు. మొదటగా రాధేశ్యామ్ సినిమాను ఓకే చేసిన ప్రభాస్ వెంటనే మహానటీ ఫేమ్ నాగ్‌అశ్విన్‌తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. మళ్లీ బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రవుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విధంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మళ్లీ ఇటీవల కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యాక్షన్ సినిమా సలార్ చేసేందుకు ఓకే అన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. దాని తరువాత సలార్ సినిమా లైన్‌లో ఉంది. దీంతో పాటుగా ఆదిపురుష్ కూడా చేయనున్నాడు. కానీ అనుకోని విధంగా రాధేశ్యామ్ షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రభాస్ ఇంకా రాధేశ్యామ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాంతో ఆదిపురుష్ దర్శకుడు ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సినిమాలో రావణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు. దాంతో ఆదిపురుష్ సినిమా మొదటి షెడ్యూల్‌లో పాల్గొనేందుకు సైఫ్ సిద్దమవుతున్నాడు.