ముగిసిన ఐర్లాండ్ ఇన్నింగ్స్... ఇంగ్లాండ్ లక్ష్యం..

ముగిసిన ఐర్లాండ్ ఇన్నింగ్స్... ఇంగ్లాండ్ లక్ష్యం..

వన్డే సూపర్ లీగ్ లో భాగంగా ఐర్లాండ్ మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. అయితే ఈ రోజు సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక 91 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న ఐర్లాండ్ జట్టు కర్టిస్ కాంపర్(68) అర్ధసెంచరీ సాధించడంతో 200 మార్కును దాటింది. ఆతిధ్య బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 విటెట్లు తీసుకోగా డేవిడ్ విల్లీ, సాకిబ్ మహమూద్ 2 వికెట్లు, జేమ్స్ విన్స్, రీస్ టోప్లీ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే 213 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతక ముందు జరిగినా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్ నిలబెట్టుకోవాలంటే ఐర్లాండ్ ఈ మ్యాచ్ గెలవాల్సిందే.. లేదంటే సిరీస్ ఇంగ్లాండ్ కు వెళ్తుంది.