జగన్ పనులు అల వైకుంఠపురంలోలా...ప్రధాని మోదీ సరిలేరు నీకెవ్వరు !

 జగన్ పనులు అల వైకుంఠపురంలోలా...ప్రధాని మోదీ సరిలేరు నీకెవ్వరు !

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. సీఎం జగన్ చేస్తున్న పనులు అల వైకుంఠపురంలోలా ఉంటే.. ప్రధాని మోదీ సరిలేరు నీకెవ్వరులా దూసుకుపోతున్నారని అన్నారు. ప్రధాని 20లక్షల కోట్లు ప్యాకేజీ ఇస్తే.. దానిని కూడా కేసీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా మా నీరు మేము వాడుకుంటే కేసీఆర్ కు ఏంటి బాధ అని ప్రశ్నించారు. కేంద్రం డబ్బు ఇస్తే సీఎం జగన్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ ఏ తప్పు చేయకున్నా తప్పు చేసినట్టు చూపుతున్నారని  విమర్శించారు ఆదినారాయణరెడ్డి. కేసీఆర్, మమతా బెనర్జీ కేంద్ర ప్యాకేజీ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయం సేకరించిన మీదటే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.