వాళ్ళకోసం నిధులు సేకరిస్తున్న హీరోయిన్

వాళ్ళకోసం నిధులు సేకరిస్తున్న హీరోయిన్

జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమా గుర్తుంది కదా అందులో హీరోయిన్ గా ప్రియమణి నటించింది.  ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసి వెండితెర నుంచి పక్కకు తప్పుకుంది.  పెళ్ళైన తరువాత బుల్లితెరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అక్కడే ఉండిపోయింది.  ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ మంచి పనికోసం నిధులను సేకరిస్తోంది.  

స్టే ఎట్ స్కూల్ అనే స్వచ్చంద సేవ సంస్థలో ప్రియమణి భాగస్వామిగా ఉంది.  ఆర్ధిక ఇబ్బందుల కారణంగా స్కూల్స్ కు దూరమైన పిల్లలను తిరిగి స్కూల్స్ లో జాయిన్ చేయడం కోసం నిధులను సేకరిస్తున్నారు.  ఇలా వచ్చిన నిధులతో పిల్లలను తిరిగి స్కూల్స్ లో జాయిన్ అయ్యేలా చూస్తున్నారు.  స్కూల్స్ లో టాయిలెట్లను నిర్మిస్తున్నారు.  మే 9 వ తేదీన 10కే రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను ఈ పనుల కోసం వినియోగించాలని నిర్ణయించింది.