డ్రగ్స్ కలకలం :  రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ నటి

డ్రగ్స్ కలకలం :  రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ నటి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్ననార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొంతమందిని విచారిస్తుంది. ఈ క్రమంలో టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది.'సంవాదన్ ఇండియా', 'దేవో కె దేవ్ మహదేవ్' వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా మంచి పేరు సంపాదించుకుంది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన ఆమెను కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. వెర్సోవాలోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ‘ఫైజల్’ అనే 20 ఏళ్ల యువకుడి నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ప్రీతికాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయితోపాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రీతికా చౌహన్ అరెస్ట్ తో మరికొందరు బుల్లితెర నటల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.