"ఎవడికి మీ మీద ప్రేమ లేదు"... పవన్ కు నటి లేఖ

"ఎవడికి మీ మీద ప్రేమ లేదు"... పవన్ కు నటి లేఖ

'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత.  ఆ తరువాత కొన్ని హిట్ సినిమాల్లో నటించింది.  హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకోని బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసింది. ఈ హీరోయిన్ ఇప్పుడు తన పేస్ బుక్ పేజీలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.  గతంలో పవన్ కళ్యాణ్ కు మాధవీలత ప్రేమ లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోసారి పవన్ కు లేఖ రాసింది. ఫేస్ బుక్ ద్వారా మాధవీలత ఓ లేఖను పోస్ట్ చేసింది. " డియర్ పవన్ కళ్యాణ్ మీకు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్ గాపెట్టలేదు. నేను ఎపుడో కాలేజీ లో ఉన్నపుడు రాసుకున్న ప్రేమ లేఖ తప్ప . డైరెక్ట్ గా  లేఖ రాయలేదు నా ఫేస్ బుక్ వేదికగా రాస్తున్న 
అసలు ఎక్కడో నార్త్ స్టేట్స్ నుండి వచ్చి మీరెవరో తెలీకుండా మీ గురించి తెలీకుండా ..తెలుగు ప్రజలకోసం మీరు పడే తపన కష్టం తెలీకుండా ...మీ భావాలు ఏంటో అర్ధం కాకుండా ..మీ భాష ఏంటో తెలీకుండా .. మీ బాధ ఏంటో తెలీకుండా ..ఇలా గాలి సోకితే వచ్చి ఇక్కడ నాలుగు సినిమాలు చేసుకుని మళ్ళి వాళ్ళ  ఊరు చెక్కేసే వాళ్ళు ..మీ మీద ఎనలేని ప్రేమ గౌరవం ఉందని , అసలు పోయిన ఏడాది మీరు పోటీ చేస్తుంటే వోట్ ఫర్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్ట్ పెట్టలేని వాళ్ళు ,జనసేనాని ని గెలిపించండి అనలేని  వాళ్ళకి  మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం . నాకు చాల కోపం తెప్పించింది. ఎన్నడూ లేని విధంగ ఈ పుట్టిన రోజు 
మొక్కలు నాటండి కుక్కలు పెంచండి. ఆవుని పెంచండి పాలు తాగండి అని మీ అట్టెన్షన్ కోసం చేస్తున్నారు.  ఎవడికి మీ మీద ప్రేమ లేదు ..పైగా మిమ్మల్ని బద్నామ్ చేయాలనీ కొంతమంది నటీమణులు ఛానల్ మెట్లు ఎక్కుతున్నారు .." అంటూ రాసుకొచ్చింది