అంగరంగ వైభవంగా చందమామ వివాహం...

అంగరంగ వైభవంగా చందమామ వివాహం...

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచమైన కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా వెండితెరపై మెరుపులు మెరిపించింది.  వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి సౌత్ ఇండియాలో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న చందమామ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కింది.  ఈరోజు ముంబైలో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది.  వీరి వివాహం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో కొద్దిసేపటి క్రితమే జరిగింది.  చందమామ కాజల్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయింది.  వివాహానికి సంబంధించిన ఫోటోలను కాజల్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.