వాళ్లని 'వదిలేది లేదు' అంటోన్న సోనూ సూద్!

వాళ్లని 'వదిలేది లేదు' అంటోన్న సోనూ సూద్!

కరోనా కష్ట కాలంలో ఎందరికో స్వంత డబ్బులతో సాయం చేశాడు సోనూ సూద్. అయితే, ఇప్పుడు ఆయన పేరునే వాడుకుని కొందరు అమాయకుల్ని మోసం  చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో నమోదైన ఓ కంప్లైంట్ కారణంగా ఆశిష్ అనే మోసగాడు అరెస్ట్ అయ్యాడు. అతను సోనూ సూద్ పేరు చెప్పి జనం నుంచీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు బయటపడింది. సామాజిక సేవ పేరుతో ఆశిష్ చాలా మొత్తాన్నే కాజేశాడట. ఇక దీనిపై స్పందించిన సోనూ, ''మొదటి మోసగాడ్ని పట్టుకున్నాం... నెక్ట్స్ మీరే!'' అంటూ జాదుగాళ్లని హెచ్చరించాడు!

తన పేరు వాడుకుని మోసం చేస్తోన్న వాళ్ల గురించి సోనూ సూద్ తీవ్రంగా స్పందించాడు. అలాంటి వారికి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష పడుతుందని చెప్పాడు. అంతే కాదు, ఎంతో అవసరంలో ఉన్న అభాగ్యులకి చెందాల్సిన డబ్బుల్ని, మధ్యలో దూరి, కాజేయటానికి మన సాక్షి అంటూ లేదా అని ప్రశ్నించాడు! అయితే, తన పేరు చెప్పి మోసం చేస్తోన్న వాళ్ల పట్ల జాలి కూడా చూపాడు సోనూ. వాళ్లకి కౌన్సిలింగ్ కూడా అవసరం అన్నాడు. ఎదుటి వార్ని మోసం చేయకుండా తన వద్దకి వస్తే.... తాను గౌరవప్రదమైన పని చూపిస్తానని ఫ్రాడ్ స్టర్స్ కి ఆఫర్ ఇచ్చాడు!