సూపర్ స్టార్‌ అనిపించుకున్నారు.. రజనీ భారీ విరాళం...

సూపర్ స్టార్‌ అనిపించుకున్నారు.. రజనీ భారీ విరాళం...

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడిపోయింది... ఇక, అన్ని సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి.. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా షూటింగ్‌లు నిలిపివేశారు మేకర్స్.. అయితే, సినిమా పరిశ్రమపై ఆధారపడి ఉన్న కార్మికుల పరిస్థితి దీనంగా మారే పరిస్థితి ఏర్పాడింది.. దిన‌స‌రి వేత‌నాల‌పై ఆధార‌ప‌డే సినీ కార్మికులు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు.. కార్మికులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. త‌మిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించి త‌న దాతృత్వాన్ని  చాటుకున్నారు. ద‌క్షిణ భార‌త ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌కు రూ. 50 లక్షలు విరాళలంగా అందజేశారు సూపర్ స్టార్.. ఇక, ఆయనతో పాటు విజ‌య్ సేతుప‌తి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే సూర్య, కార్తి ఇలా పలువురు హీరోలు, నటులు కార్మికులను ఆదుకోవడానికి విరాళాలు అందజేశారు.