నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన నరేశ్

నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన నరేశ్

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ డిసెంబర్ 31న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వివిధ భాషల్లో దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ చురుకైన పాత్రను పోషించారు. దాంతో గురువారం 'మా' అధ్యక్షుడు నరేశ్ సుల్తాన్ బజార్ లోని నర్సింగ్ యాదవ్ ఇంటికి వెళ్ళి, అతని భార్య, కుమారుడిని పరామర్శించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున రాబోయే రోజుల్లోనూ నర్సింగ్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.