ఆచార్య షూటింగ్‌కి మెగాస్టార్‌ రెడీ..ఎప్పటినుంచంటే

ఆచార్య షూటింగ్‌కి మెగాస్టార్‌ రెడీ..ఎప్పటినుంచంటే

కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ వైరస్ వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. లాక్‌ డౌన్‌ వల్ల షూటింగ్లు, థియేటర్లు మూతపడ్డాయి. ఇక ఇటీవల ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ..షూటింగ్లకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌ ఫుల్‌ బీజీ అయింది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కరోనాతో ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుంది.  ఇదే రోజు చిరంజీవి కూడా షూటింగ్‌ లో పాల్గొననున్నారు. కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వస్తున్న తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో వైవు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమా తరవాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించనున్నాడు చిరు. వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.