నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ప్రమాదం

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ప్రమాదం

నంద్యాల ఎస్పీ.వై.ఆగ్రో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని బాయిలర్ లీక్ అయి దక్షిణామూర్తి అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దక్షిణమూర్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ‌కొలుకోలేక దక్షిణ మూర్తి మృతి చెందాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.