సింగరేణి గనిలో ప్రమాదం..

సింగరేణి గనిలో ప్రమాదం..

సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కేటీకే 6వ గనిలో ప్రమాదం సంభవించింది.. కేటీకే 6వ గనిలో రూప్ కూలడంతో దాని కింద ఇద్దరు సింగరేణి కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం.. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్నిఅందుకున్న అధికారులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.. రూప్ కింద చిక్కుకున్న కార్మికులు క్యాతం నరసయ్య, తలవెని శంకరయ్యగా భావిస్తున్నారు అదికారులు.. 3 టీమ్ 11,11 జేషన్‌లో ఈ ప్రమాదం జరగగా.. ఘటనా స్థలం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.