పదో తరగతి ఫెయిలైన ముఖ్యమంత్రిగా అభిషేక్ బచ్చన్

పదో తరగతి ఫెయిలైన ముఖ్యమంత్రిగా అభిషేక్ బచ్చన్

తన నెక్ట్స్ మూవీ ‘దస్వీ’లోని గంగారామ్ చౌదరి క్యారెక్టర్ ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు అభిషేక్ బచ్చన్. సొషల్ మీడియాలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసిన ఆయన ‘మీట్ గంగారామ్ చౌదరి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ‘షూట్ బిగిన్స్’ అంటూ సినిమా కిక్ స్టార్ట్ అయిన సంగతి కూడా అభిషేక్ చెప్పాడు.

‘దస్వీ’ సినిమా ఓ పొలిటికల్ కామెడీ. కొత్త డైరెక్టర్ తుషార్ జలోటా సారథ్యం వహిస్తుండగా దినేశ్ విజన్ మాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో చదువు ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా మేకర్స్ చెప్పదలుచుకున్నారట. 

పదో తరగతి ఫెయిలైన సీఎంగా అభిషేక్ బచ్చన్ కనిపించబోయే ‘దస్వీ’ సినిమా షూటింగ్ మొదట ఆగ్రాలో జరగనుంది. ఈసారి పొలిటికల్ హ్యూమర్ తో సబ్జెక్ట్ ఎంచుకున్న నిర్మాతలు గతంలో ‘హిందూ మిడియమ్, అంగ్రేజీ మిడియమ్, బాలా’ లాంటి సినిమాలు తీసినవారే. గత చిత్రాల సక్సెస్ దృష్ట్యా అభిషేక్ బచ్చన్, యమీ గౌతమ్, నిమ్రత్ కౌర్ స్టారర్ ‘దస్వీ’పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.