కరోనాను  జయించిన స్టార్ హీరో

కరోనాను  జయించిన స్టార్ హీరో

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదో రకంగా కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు , సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక సెలబ్రెటీలకు కరోనా సోకడం వారి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . కాగా వారిని నుంచి ఇప్పటికే ఐశ్వర్య రాయ్ , ఆమె కుమార్తె ఆరాధ్య , అమితాబ్ కోలుకున్నారు . కరోనా పాజిటివ్ అని తెలియగానే వీరంతా ముంబై లోని నానావతి హాస్పటల్ లో చేరారు . ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అభిషేక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. " ఈ రోజు మధ్యాహ్నం నాకు నెగిటివ్ అని తేలింది . నేను మీకు ముందే చెప్పాను ఈ మహమ్మారిని ఎదురుకుంటానని . నాకోసం , నా కుటుంబం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. " అని ట్వీట్ చేసారు. అదే విధంగా తమకు సేవలందించిన హాస్పటల్ సిబ్బందికి అభిషేక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.