అభినందన్‌ స్వగ్రామంలో సంబరాలు

అభినందన్‌ స్వగ్రామంలో సంబరాలు

పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన (ఐఏఎఫ్‌) పైలట్, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌ గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అభినందన్‌ సురక్షితంగా విడుదల కావాలని గురువారం జైన ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అభినందన్‌ను సురక్షితంగా విడిపించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంను కోరారు. ఈ రోజు అభినందన్‌ను విడుదలవుతుండంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.