ఏపీలో అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్...

ఏపీలో అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్...

సోమవారం ఏపీ లో అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం జగన్. మహిళల రక్షణ కోసం ప్రాజెక్టు అభయ పేరుతో పథకాన్ని పుపొందించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏపీలో అభయం పేరుతో ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్భయ ఘటన తర్వాత ప్రాజెక్టు అభయ పథకాన్ని కేంద్రం రూపొందించింది. అభయం ప్రాజెక్టులో భాగంగా ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలను అమర్చనుంది ప్రభుత్వం. రూ. 135 కోట్లతో లక్ష ఆటోల్లో ట్రాకింగ్ డివైసులు అమర్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం భరించనుంది. ఇందులో ఇప్పటికే రూ. 58.64 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఏపీలో పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖలో అభయం అమలుకానున్నాయి.