దెందులూరు టీడీపీ అడ్డా కాదు...వైసీపీ గడ్డ

దెందులూరు  టీడీపీ అడ్డా కాదు...వైసీపీ గడ్డ

గెలిచిన వైసిపి సర్పంచ్ అభ్యర్థులతో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని.. దెందులూరు నియోజకవర్గంలో 81 శాతం పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా కాదు...ఇది వైసీపీ గడ్డ అని ప్రజలు ఈ ఎన్నికలతో మరొసారి నిరూపించారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. తన స్వగ్రామం కొండలరావు పాలెంలో వైసీపీ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ  విజయం సాధించిందని  చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పింది నిజమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధమైతే చంద్రబాబు  రాజీనామా చేస్తారా ? వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలని హెచ్చరించారు.