దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు మరోసారి నన్ను చేపటమన్నారు : ఎబిడి

దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు మరోసారి నన్ను చేపటమన్నారు : ఎబిడి

క్రికెట్ దక్షిణాఫ్రికా "మరోసారి తనను జాతీయ జట్టుకు నాయకత్వం వహించాలని" కోరింది అని ఎబి డివిలియర్స్ తెలియజేసాడు. విధ్వంసకర బ్యాట్స్మాన్ అయిన డివిలియర్స్ 2018 మే లో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, కాని తరువాత గత ఏడాది ప్రపంచ కప్ నుండి అతను జాతీయ జట్టులో తిరిగి రావడం గురించి చర్చలు జరుగుతున్నాయి. అతను ఇప్పటివరకు 114 టెస్టులు, 228 వన్డేలు మరియు 78 టీ 20 లు ఆడాడు.  "దక్షిణాఫ్రికా తరఫున ఆడాలనే కోరిక నా వైపు నుండి ఉంది మరియు జట్టును మళ్లీ నడిపించాలని క్రికెట్ దక్షిణాఫ్రికా కోరింది" అని 36 ఏళ్ల డివిలియర్స్ తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాలో జరగబోయే టీ 20 ప్రపంచ కప్ కోసం డివిలియర్స్ జాతీయ జట్టులోకి తీసుకునే ఆటగాడిగానే పరిగణించబడతానని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఇంతకుముందు చెప్పాడు. అయితే ప్రస్తుతం ఆ టోర్నీ చుట్టూ కరోనా నీడలు కమ్ముకున్నాయి. అందువల్ల అది జరుగుతుందో లేదో తెలియదు. ఇటువంటి సమయం లో ఎబిడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడు ఆడుతాడో అనే విషయం పై స్పష్టత లేదు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.