టీ-20 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసిస్‌

టీ-20 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసిస్‌

టీం ఇండియా, ఆస్ట్రేలియా టీంల మధ్య టీ-20 సమరం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బౌలింగ్‌ కు మొగ్గు చూపాడు. ఇప్పటికే 2-1 తో వన్డే సిరిస్‌ గెలిపొందిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్‌ పైన కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టి టీ20 లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటా పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ 20 మ్యాచ్‌ పై ఆస్తకి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. 
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్‌ ఫించ్‌ {కెప్టెన్‌}, మాథ్యూవేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, అలెక్స్‌, క్యారీ, గ్లెన్‌ మాక్స్‌ వెల్‌, ఆష్టన్‌ అగర్‌, సీన్‌ అబోట్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌ వుడ్‌, ఆడం జంపా
ఇండియా జట్టు : విరాట్‌ కోహ్లి  {కెప్టెన్‌}, కెఎల్‌ రాహుల్‌,  శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, షమీ