ఇన్నాళ్ల తరవాత విడుదలకు సిద్దమైన యాక్షన్ హీరో సినిమా

ఇన్నాళ్ల తరవాత విడుదలకు సిద్దమైన యాక్షన్ హీరో సినిమా

మాస్ హీరో గోపీచంద్ ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈయన నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పాటు కొన్ని సినిమాలు మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.గోపీచంద్‌ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా తర్వాత గోపిచంద్.. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’‌లో నటించనున్నాడు. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ హీరోగా చేస్తోన్న మొదటి సినిమా ఇది.ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన ''ఆరడుగుల బుల్లెట్'' అనే సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వక్కంతం వంశీ స్టోరీ - స్క్రీన్ ప్లే అందించాడు. స్టార్ హీరోయిన్ నయనతార గోపీచంద్ కు జోడీగా నటించింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అనేక వాయిదాల తర్వాత 2017 జూలై 16న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. సినిమాని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'జీ 5 ఒరిజినల్' లో విడుదల చేయబోతున్నారట. ఈ సినిమా కోసం 7 నుంచి 8 కోట్లకు మధ్య డీల్ కుదుర్చుకున్నట్లు ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా ఫెస్టివల్ సీజన్ లో స్ట్రీమింగ్ కి పెట్టనున్నారని సమాచారం.