సూరత్ లో బీజేపీకి షాకిచ్చిన ఆప్ 

సూరత్ లో బీజేపీకి షాకిచ్చిన ఆప్ 

గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి.  అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, జామ్ నగర్, భావ్ నగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయాలు సాధిస్తున్నారు.  అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ ముందంజలో ఉన్నది.  అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరూ ఊహించని విధంగా సూరత్ లో దూసుకుపోతున్నది.  తాజా సమాచారం ప్రకారం సూరత్ లో బీజేపీ 46 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది.  అయితే, ఆప్ అనూహ్యంగా 18 చోట్ల విజయం సాధించి షాక్ ఇచ్చింది.  అటు జామ్ నగర్, భావ్ నగర్ లోనూ ఆప్ నాలుగు చోట్ల విజయం సాధించింది.