ఆ పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించాలంటున్న భారత ఆటగాడు...

ఆ పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించాలంటున్న భారత ఆటగాడు...

మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల కొందరి వాదనల ఫై ఘాటుగా స్పందించారు, 2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయి ఉండొచ్చని, తద్వారా టోర్నమెంట్‌లో తమ ప్రత్యర్థులు అయిన పాక్ ముందుకు సాగవద్దని భారత్ అనుకున్నట్లు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్, ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్, లెగ్ స్పిన్నర్ ముష్తాక్ అహ్మద్‌లు వారు తెలిపారు. అయితే ఆ మ్యాచ్ల్లో జానీ బెయిర్‌స్టో యొక్క అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ 337 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 102 పరుగులు చేసినప్పటికీ ఆతిథ్య జట్టు భారత్‌ను 5 వికెట్ల వద్ద 306 పరుగులకు పరిమితం చేసింది.  ఈ విజయం వల్ల ఇంగ్లాండ్ సెమీ-ఫైనల్కు మూడవ స్థానంలో నిలిచింది, పాకిస్తాన్ రౌండ్-రాబిన్ దశలో 5 వ స్థానంలో నిలిచింది.

అయితే ఈ విషయనే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ ఇటీవల తన పుస్తకం 'ఆన్ ఫైర్'లో ప్రస్తావించిన తరువాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చేసిన ఆరోపణలు మరింత బలపడ్డాయి, కానీ చోప్రా అటువంటి వాదనలన్నింటినీ ఖండించారు అలాగే ఆ ఆటలో భారత్ ఓడిపోయిందని చెబుతున్న వారందరికి జరిమానా విధించాలని ఐసీసీ ని కోరారు. ''కొంచెం ఆలోచించి కొంచెం సిగ్గుపడండి. ఐసీసీ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పటికీ, ప్రపంచ కప్ సందర్భంగా భారత్ ఒక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా ఓడినట్లు వకార్ యూనిస్ ఒక ప్రకటన ఇచ్చారు. నేను దానిని తీవ్రంగా అర్థం చేసుకున్నాను, ”అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు. మీరు ఎలా అలా అనుకోవచ్చు? ఆ సమయంలో భారతదేశం తమ గ్రూప్ లో అగ్రస్థానంలో ఉండటం చాలా ముఖ్యమైనది, ”అని చోప్రా అన్నారు. అయితే చూడాలి మరి ఈ విషయం పై ఇంకా ఎవరు స్పందిస్తారు అనేది.